ఆంధ్రప్రదేశ్‌

హోం వర్క్ చేయలేదని చిన్నారికి చిత్ర హింసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చెయ్యపేట, అక్టోబర్ 24: విశాఖపట్నం జిల్లా, బుచ్చెయ్యపేట మండలంలోని వడ్డాది కొత్తూరుకు చెందిన వెలగుల పూజ పల్లవి అనే అయిదేళ్ళ చిన్నారిపై ఉపాధ్యాయిని తన ప్రతాపాన్ని చూపించింది. విద్యార్థిని తండ్రి వెలుగుల నాగేశ్వరరావు అందించిన వివరాలివి. వడ్డాదిలోని ఎన్‌టిఎస్ ప్రైవేట్ పాఠశాలలో పూజపల్లవి యుకెజి చదువుతోంది. హోం వర్క్ చేయలేదని విద్యార్థిని చేయిపై క్లాస్ టీచర్ కర్రతో కొట్టింది. సాయంత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుండి చెయ్యి నొప్పి పెడుతోందంటూ పూజ పల్లవి ఏడుస్తుండటం, చేయి వాపు రావటంతో ఆ పాప తల్లిదండ్రులు ఆరా తీశారు. వెంటనే చోడవరంలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా, టీచర్ కొట్టిన దెబ్బలకు విద్యార్థిని కుడిచేతి ఎముక పగిలిందని వైద్యుడు ఎక్సరే తీసి ధ్రువీకరించాడు. ఆది, సోమవారాలు పాఠశాలకు సెలవు కావటంతో మంగళవారం బాధితురాలి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సంఘటన తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ పాఠశాలకు చేరుకొని, పాఠశాల యాజమాన్యాన్ని, విద్యార్థిని తల్లిదండ్రులను విచారించారు. ఇటీవల కాలంలో పిల్లలపై ఉపాధ్యాయులు పాశవికంగా ప్రవర్తిస్తూ, గాయాలకు గురిచేస్తుండడంతో స్థానికులు మండిపడుతున్నారు.