ఆంధ్రప్రదేశ్‌

సొంత లాభం కోసమే రాజధానిపై గోప్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, అక్టోబర్ 24: రాజధాని నిర్మాణం ఏమాత్రం ముందుకు సాగడం లేదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణం పూర్తికావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితేనే సాధ్యమవుతుందని అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీని వల్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదన్నారు. స్వలాభాపేక్ష కోసం నిర్మాణాల విషయాలను రహస్యంగా ఉంచుతున్నారన్నారు. చంద్రబాబు ఏ దేశానికి వెళితే ఆ దేశ రాజధాని తరహాలో నిర్మాణాలు చేయాలని సంకల్పిస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. టిడిపి హయాంలో తాత్కాలిక రాజధాని కూడా పూర్తి కాదన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి శాశ్వత రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేస్తుందన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితమిచ్చేవిగా కనిపించడం లేదన్నారు. పోలవరం శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చిన సందర్భంగా ఖర్చుచేసిన రూ.600 కోట్లను పోలవరానికి వెచ్చించి ఉన్నా 20 శాతం పనులు పూర్తి అయ్యేవన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందచేయాలన్నారు. గత ఎన్నికల సమయంలో ఉద్యోగం రాని ప్రతి ఒక్కరికీ భృతి ఇస్తామన్న చంద్రబాబు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం 10 లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఉద్యోగం రాని ప్రతి ఒక్కరికీ భృతి ఇవ్వాలన్నారు. కేవలం టిడిపి వర్గీయులకే నిరుద్యోగ భృతి ఇవ్వడానికి చేసే ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. రాష్ట్రంలో నవంబర్ 19వ తేదీ వరకు ఇందిరమ్మ శతజయంతి వేడుకలు నిర్వహిస్తామని రఘువీరా తెలిపారు. ఇందులో భాగంగా 18వ తేదీ మదనపల్లిలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.