ఆంధ్రప్రదేశ్‌

నవంబర్ నెలాఖరులోగా ఓటర్ల జాబితా సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 24: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సవరణను నవంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు, ఇఆర్‌ఓలతో ఆయన సమావేశమై ఓటర్ల జాబితా పూర్తి సవరణపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్యాబ్‌లతో ఇప్పటికే పెద్ద నగరాలలో సవరణ కార్యక్రమం పూర్తిచేయడం జరిగిందన్నారు. దీనివల్ల పారదర్శకతతో ఓటర్ల జాబితా సిద్ధమవుతుందన్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఇప్పటికే సర్వే పూర్తయిందని, మిగిలిన 7 మున్సిపాలిటీల్లో నవంబర్ 1 నుంచి 24వ తేదీ వరకు బిఎల్వో, మున్సిపల్ సిబ్బంది ఇద్దరూ కలిసి ప్రతి ఇల్లు తిరిగి ట్యాబ్‌ల సహాయంతో సవరణ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. నజరి నక్షత్ర కార్యక్రమం కింద శిక్షణ తీసుకుని గూగుల్ మ్యాప్‌లో పోలింగ్ కేంద్రాన్ని చూపే విధంగా ఉండాలని, అందులో వీధుల్లోని డోర్ నెంబర్‌లతో సహా ఉండాలన్నారు. డోర్ నెంబర్ లేని వాటికి వరుసగా వచ్చే విధంగా డోర్ నెంబర్‌లను ప్రతి ఇంటిపైన మార్క్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.