ఆంధ్రప్రదేశ్‌

కాల్ అంబులెన్స్ యాప్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 24: రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సోషల్ ఎమర్జన్సీ అండ్ రెస్పాన్స్ వాలంటీర్(ఎస్.ఇ.ఆర్.వి) కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఇక్కడి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్‌క్రాస్ నిర్వహించిన ఈ సర్వ్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాల్ అంబులెన్స్ యాప్‌ను సైతం ప్రారంభించారు. సర్వ్ కార్యక్రమం దేశంలో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ యాప్‌ను మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో ప్రారంభమైంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుటకు ఉపయోగపడే యాప్ ఇది. హైదరాబాద్‌లోగల సాఫ్ట్‌వేర్ కంపెనీ రూపొందించింది. ఉమాశంకర్ కొత్తూరు, జగదీష్ విశ్వనాథం అనే సాఫ్ట్‌వేర్ నిపుణులు దీనిని తయారు చేశారు. జి.పి.ఎస్.తో మొబైల్ సిమ్ సర్వీసును అనుసంధానం చేసి అత్యవసర పరిస్థితుల్లో ఒక క్లిక్‌తో వ్యక్తిగత వివరాలు, ప్రమాద స్థలం, సమీపంలోగల ఫస్ట్ రెస్పాండర్‌కు, అంబులెన్స్‌కు, దగ్గరలోగల ఆసుపత్రికి, కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తుంది. కాల్ అంబులెన్స్ యాప్‌ను శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, రక్తనిల్వ కేంద్రాలు, మందుల దుకాణాలు, డయాగ్నాస్టిక్ లాబ్‌లు, రవాణాశాఖ తదితర సంబంధిత సమాచారంను అనుసంధానం చేశారు. రెడ్‌క్రాస్ సంస్థ చేపట్టిన సర్వ్ కార్యక్రమం ద్వారా 27 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ వాలంటీర్లను ఫస్ట్ రెస్పాండెంట్‌లుగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తి కాల్ అంబులెన్స్ యాప్‌ను క్లిక్ చేయడం ద్వారా తక్షణం వివరాలు అందరికీ అందుతుంది. హైదరాబాద్-వరంగల్ హైవేలో రెండేళ్ళ కిందట సంభవించిన ఒక సంఘటన యాప్ తయారీకి ప్రేరణగా నిలిచిందని భాగస్వామి విశ్వనాథ్ వివరించారు.

చిత్రం..కాల్ అంబులెన్స్ యాప్ ప్రారంభిస్తున్న
రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు