ఆంధ్రప్రదేశ్‌

జూన్ 17న విజయవాడలో జాతీయ పోషకాహార సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: పోషకాహార లోపం విభిన్న రూపాల్లో వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుండగా, సమస్యను అధిగమించేందుకు సమాజంలోని అన్ని వర్గాల నుండి సహకారం తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. పోషకాహారం అంశంపై విజయవాడ వేదికగా ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించేందుకు యునిసెఫ్ సన్నాహాలు చేస్తుండగా, శనివారం నాడు ఈ అంశంపై శాసనసభాపతి తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష చేశారు. జూన్ 17న విజయవాడ తాజ్‌లో ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. దీనికి సన్నాహక సమావేశం నిర్వహించి ఆశించిన ఫలితం వచ్చేలా అన్ని చర్యలూ తీసుకోవాలని స్పీకర్ సూచించారు. ఈ క్రమంలో జూన్ 4వ తేదీన శాసనసభ ఆవరణలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని అన్నారు. దీనికి మహిళా శిశు సంక్షేమ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రితో పాటు సంబంధిత ఉన్నతాధికారులను కూడా పిలవాలని సభాపతి ఆదేశించారు. 17వ తేదీన జరగనున్న కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొంటున్నందున పూర్తి సమాచారాన్ని సిఎం కార్యాలయానికి కూడా పంపించాలని అన్నారు. సమాజంలో విభిన్న వర్గాలను ఈ సదస్సు ద్వారా ఒకే వేదికపైకి తీసుకువచ్చి భవిష్యత్‌లో చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించాల్సి ఉందని కోడెల అన్నారు. తన ధాతృత్వం సద్వినియోగం అవుతుందని భావిస్తే పెద్ద ఎత్తున తన వ్యధాన్యతను చాటుకునేందుకు ఆర్ధికంగా ఉన్నత స్థానంలో ఉన్న వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేవలం సమన్వయంతోనే ఎంతో సాధించవచ్చనే విషయాన్ని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమాలతో రుజువు చేశామని గుర్తుచేశారు. పోషకాహార లోపంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని, ఇందుకు శాసనసభ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ఒక వైద్యునిగా పోషకాహార లోపం వల్ల భావితరాలు పడే ఇబ్బందులు తమకు విధితమేనని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని సూచించారు. సమావేశంలో యునిసెఫ్ ప్రతినిధులు సంజీవ్ ఉపాధ్యాయ, ఎస్ ఆర్ నల్లి, సభాపతి కార్యాలయ అధికారి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.