ఆంధ్రప్రదేశ్‌

మైనార్టీ సంక్షేమ నిధులు సద్వినియోగం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: మైనార్టీల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని ఆయా వర్గాల ఉన్నతికి తోడ్పడాలని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేస్తుందని, అధికారులు తమ వంతుగా స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేస్తే వారు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. శనివారం నాడు తన ఛాంబర్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సభాపతి భేటీ అయ్యారు. ప్రత్యేకించి గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఈ శాఖ తరఫున చేపడుతున్న పనుల పురోగతిని సభాపతి సమీక్షించారు. నిధులతో పాటు, అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ టెండర్లు ప్రక్రియ పరంగా జరుగుతున్న ఆలస్యంపై సభాపతి అధికారులను ప్రశ్నించారు. ప్రత్యేకించి నరసారావు పేటలో నిర్మించతలపెట్టిన మైనార్టీ ఐటిఐ, వంద పడకల వసతి గృహం నిర్మాణానికి వెంటనే అధికారులు టెండర్లు పిలవాలని ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో మైనార్టీ సంక్షేమ నిధుల నుండి నిర్మించతలపెట్టిన అదనపు తరగతి గదుల గురించి ఆరా తీశారు. పనులు ప్రారంభమైన చోట వేగంగా పనులు సాగాలని, వర్షాలు ప్రారంభం అయితే పనులు సాగవని, ప్రస్తుత వేసవి సీజన్‌లో పూర్తిస్థాయిలో పనులు జరగాలని స్పష్టం చేశారు. నిధులు ఉన్నప్పటికీ స్థలం కేటాయింపు లేక పెండింగ్‌లో ఉన్న వంద పడకల బాలికల వసతి గృహ నిర్మాణంపై తాను కలెక్టర్‌తో మాట్లాడతానని, వెంటనే స్థలాన్ని కేటాయిస్తారని అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలో మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రణాళికాబద్దంగా తాము చేపడుతున్న పనులను వివరించారు. అదనపు కార్యదర్శి విద్యాధర్, డిప్యూటీ డైరెక్టర్ సుమతీ కుమారి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.