ఆంధ్రప్రదేశ్‌

స్కానింగ్ సెంటర్లకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 26: అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ఇక నుండి ఆన్‌లైన్‌లో సంబంధిత శాఖలు జారీ చేయనున్నాయి. స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుతోపాటు రెన్యువల్స్‌కు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. స్కానింగ్ సెంటర్ల వివరాలను ఇకనుండి ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ విషయంలో పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో గర్భస్థ పిండ నిర్ధారణ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, అక్రమ మార్గంలో స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇక నుండి స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
డెకాయ్ తనిఖీల్లో అక్రమాలకు పాల్పడినట్టు రుజువైన పక్షంలో బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. అనేక స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి, చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పుట్టే బిడ్డ ఆడ లేక మగ అనే విషయాన్ని తెలుసుకునేందుకు తల్లిదండ్రులు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. సంపాదనే ధ్యేయంగా సాగే కొన్ని సెంటర్లలో ఇటువంటి అక్రమాలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఫలితంగా అబార్షన్లకు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ప్రధాన కారణమవుతున్నారన్న విమర్శలున్నాయి. స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, అర్హత లేని వారు ఈ సెంటర్లను నిర్వహించిన పక్షంలో వారిపై కఠినంగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
నకిలీ వైద్యులపై దృష్టి సారించి, అర్హత లేని వారు సెంటర్లను నిర్వహించిన పక్షంలో వాటిని సీజ్ చేయాలని స్పష్టం చేసింది. అలాగే నిబంధనల మేరకే స్కానింగ్‌కు రుసుం వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. డెకాయ్ తరహా తనిఖీలను సెంటర్లపై తరచూ నిర్వహించి, అక్రమార్కులపై చర్యలు తీసుకోనున్నారు. డివిజన్‌ల స్థాయిలో ఆర్డీవోలు ఈ తనిఖీలకు పర్యవేక్షణ వహిస్తారు. స్కానింగ్ సెంటర్లను ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి రెన్యువల్ చేయడంతో పాటు వీటి పనితీరు సక్రమంగా లేని పక్షంలో దరఖాస్తులను తిరస్కరించనున్నారు.