ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబుళదేవరచెరువు, అక్టోబర్ 26: రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి మార్గాలు చూపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. జనం కోసం జెపి సురాజ్య యాత్రలో భాగంగా గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఓబులదేవరచెరువులోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జెపి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలేదన్నారు. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా దిగజార్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో మధ్యతరగతి, రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు ఎక్కువ మంది తల్లిదండ్రులకు దూరంగా సుదూర ప్రాంతాల్లోని కళాశాలల్లో చదువుకుంటున్నారన్నారు.
తాము ఎంచుకున్న రంగంలో తీవ్రంగా నష్టపోయినా తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు శ్రమిస్తున్నారన్నారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు విద్య కోసం వెచ్చిస్తున్నా అవి విద్యార్థినీవిద్యార్థులకు సక్రమంగా అందడం లేదన్నారు. ర్యాంకులు, మార్కుల ఆధారంగా ప్రతిభను కొలవడం తగదన్నారు. ప్రతిభాపాటవాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు తాము ఎంచుకున్న చేతి వృత్తుల నైపుణ్యం సాధిస్తే చైనా, జపాన్ వంటి దేశాల సరసన భారతదేశం కూడా నిలబడుతుందన్నారు. 74 దేశాల్లో పదోతరగతి విద్యార్థుల ప్రతిభా పాఠవాలను బేరీజు వేస్తే భారతదేశం 73వ స్థానంలో ఉందన్నారు. నిరుద్యోగులకు సరైన ఉపాధి దొరకడం లేదన్నారు. వారు చదివిన చదువు ఒకటైతే వృత్తి మరోటి ఎంచుకోవాల్సిన దుస్థితి ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో వౌళిక వసతులు, శాంతిభద్రతలు, ఇతర ప్రాజెక్ట్‌లు కేవలం 50 శాతం మాత్రమే ప్రజల అవసరాలు తీరుస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులు నిర్లక్ష్యం వీడి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే తమ పార్టీ వారి పక్షాన నిలుస్తుందన్నారు.