ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ బహిష్కరణపై విమర్శల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకనే వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ కుంటిసాకులతో శాసనసభ నుంచి పారిపోతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటే 10 రోజులపాటు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ పాదయాద్ర ఎందుకు వాయిదా వేసుకోలేరని ప్రశ్నించారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ చేసిన విమర్శలపై శాసనసభలో సమాధానం చెప్పుకోలేకే సమావేశాలకు ఆ పార్టీ హాజరుకావడం లేదని ఆరోపించారు. అలాగే ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, ఇతర నాయకులపై నమ్మకం లేకనే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బహిష్కరించిందని వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 టోల్‌ఫ్రీ నెంబరు తమకు ప్రతిపక్షంలా ఉపయోగపడుతుందని, ప్రజా సమస్యలపై తమకు ఫీడ్‌బ్యాక్ టోల్‌ఫ్రీ ద్వారా అందుతున్నాయని వెల్లడించారు. ఢిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహరాల శాఖ మంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ అధ్యక్షతన వినియోగదారుల ఈస్ట్ సౌత్ ఆసియా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పుల్లారావు హాజరయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోసపోకుండా, నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సదస్సులో చర్చించినట్టు తెలిపారు.
మడకశిర: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న వైకాపా ప్రకటించడం పెద్ద పొరపాటు అని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కోల్పోయినట్టవుతుందన్నారు. దీనిపై పార్టీ అధినేత జగన్ పునరాలోచించాలని ఆయన సూచించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ జగన్ నిర్ణయాన్ని చూస్తే అటు తెలుగుదేశం, ఇటు బిజెపితో కుమ్మక్కైనట్లు కనిపిస్తోందన్నారు. జగన్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని విస్మరించడమేనన్నారు.
ఈ నిర్ణయాన్ని జగన్ ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న టిడిపిని అసెంబ్లీలో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తుంటే వాటిని అసెంబ్లీలో ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన వైకాపా బాధ్యతల నుండి వైదొలగడం భావ్యం కాదన్నారు. ఏడాదిన్నర కాలంలో దాదాపు ఆరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఇలాంటి సమయంలో బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ ఏడాది ముందే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోవడం ఆ పార్టీ అనుభవ రాహిత్యాన్ని సూచిస్తోందన్నారు.
ప్రజా సమస్యలు, అధికార పార్టీ రాక్షస పాలనను అసెంబ్లీలో నిలదీసి సత్తాచాటాలని, వాకౌట్ చేయాలే తప్ప మొత్తానికి బహిష్కరించాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. .
విజయవాడ్ రానున్న ఎన్నికల్లో వైకాపా పోటీచేసే అర్హతను కోల్పోతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయకుండా వైసిపి నాయకులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని గురువారం ఒక ప్రకటనలో జవహర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరు శాతం ప్రజల్లోకి వెళ్లడంతో అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలో తెలియకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తుచేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలకు అవకాశమివ్వకుండా గొడవలు సృష్టించి వాకౌట్ చెయ్యడం అందరికీ తెలిసిందేనన్నారు.
ఈసారి మరో అడుగు ముందుకేసి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తామని చెప్పటం సరికాదని అన్నారు. రాష్ట్రంలో విపక్ష నేతగా విఫలమవటంతో తన కేసుల నుండి తప్పించుకునేందుకు పాదయాత్ర చేయనున్నట్లు విమర్శించారు. రాజకీయ లబ్ధికోసమే జగన్ పాదయాత్ర చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్భ్రావృద్ధిని చూసి జగన్ ఓర్వలేకే పాప పరిహారపు పాదయాత్ర మొదలు పెడుతున్నారన్నారు.