ఆంధ్రప్రదేశ్‌

11 ప్రాజెక్టులపై కేంద్రం ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 26: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో కొత్తగా చేపడుతున్న 11 ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ, రోడ్లు భవనాల శాఖ, రైల్వే శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారులకు సంబంధించి జాతీయ రహదారి 216కి అనుసంధానంగా కత్తిపూడి నుంచి లోసారిగుట్లపాడు రహదారి, జాతీయ రహదారి 214ఎ అభివృద్ధి, విస్తరణతోపాటు విజయవాడ-గుండుగొలను మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణంపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. రైల్వేకు చెందిన 4 ప్రాజెక్టులు నడికూడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూరు, తిండివనం-నగరి, రాయదుర్గం-తుముకూ రు వయా కళ్యాణ్ దుర్గం మధ్య చేపట్టనున్న నూతన రైళ్ల నిర్మాణాల పనులు జరుగుతున్న తీరును ఆయా జిల్లాల అధికారులను అడిగి తెలుసుకున్నారు.