ఆంధ్రప్రదేశ్‌

అది ప్రజా సంకల్ప యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: వచ్చే నెల 6వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్రగా నామకరణం చేశారు. ఈ పాదయాత్ర 125 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా మూడు వేల కి.మీ సాగుతుందని, పార్టీకి నూతనోత్తేజం తెచ్చి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ ఈ యాత్ర చేపట్టినట్లు వైకాపా ప్రకటించింది. ఈ వివరాలను పార్టీ సీనియర్ నేతలు మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. ఈ యాత్రలో రెండు కోట్ల మంది ప్రజలతో జగన్ మాట మంతీ జరుపుతారన్నారు. మూడున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతిపాలైందన్నారు. రెండవ దశలో 13 జిల్లాల్లో మిగిలిన 50 అసెంబ్లీ నియోజకవర్గాలను బస్సు యాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుంటారన్నారు. పాదయాత్ర ఆరు నెలల పాటు కొనసాగుతుందన్నారు. మొదటి నాలుగు నెలలు రచ్చ బండ, పల్లె నిద్ర అనే కార్యక్రమాలు ఉంటాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తారన్నారు. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వైకాపా ప్రజలకు చేయనున్న మేలు గురించి వివరిస్తారన్నారు. పల్లె నిద్రలో కో ఆర్డినేటర్లు స్ధానిక ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడే బస చేస్తారని, బలహీనవర్గాల స్థితి గతులను విచారిస్తారన్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రణాళికలను రూపొందిస్తామని పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారన్నారు. వీటిని తుది ఎన్నికల ప్రణాళికలో చేరుస్తారని వారు తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై స్ధానిక ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో సమావేశాలను నిర్వహించాలని జగన్ కార్యకర్తలను కోరారు. ఈ పాదయాత్రలో 45 లక్షల కుటుంబాలతో జగన్ మాట్లాడుతారన్నారు. ఐదు వేల పాయింట్లలో స్ధానిక కో ఆర్డినేటర్లతో మాట మంతీ నిర్వహిస్తారు. 125 నియోజకవర్గాల్లో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు సందర్శకులతో ముచ్చటిస్తారు. పాదయాత్ర మధ్యాహ్నం 12 గంట వరకు జరుగుతుంది. మళ్లీ మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు సందర్శకులను కలుసుకుంటారు.