ఆంధ్రప్రదేశ్‌

పెద్ద నోట్ల రద్దుపై 8న దేశవ్యాప్త నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 26: దేశంలో పెద్దనోట్లు రద్దుచేసి నవంబరు 8వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నిరసన దినంగా పాటించాలని కేంద్రంలోని ఆరు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు వల్ల ఎనలేని ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో జరిగిన బహిరంగ సభల్లో పదేపదే చెప్పారన్నారు. అయితే దేశంలో ఎక్కడా కూడా నల్లధనం బయటపడలేదు సరికదా.. 99 శాతం రద్దయిన పెద్ద నోట్లు బ్యాంకులకు చేరిపోవడం ద్వారా నల్లధనం కాస్తా తెల్లధనంగా మారిపోయిందన్నారు. పెద్దనోట్ల రద్దు ద్వారా కేంద్రం నల్లధన నేరస్థులందరికీ క్లీన్‌చిట్ ఇచ్చినట్లయిందని ఆయన ఎద్దేవా చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాదుల వద్ద కూడా నల్లధనం పెద్దఎత్తున ఉంది.. నోట్ల రద్దుతో వారి కార్యకలాపాలను అరికట్టవచ్చని మోదీ చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. ఏడాది కాలంలో సరిహద్దుల వెంట ఉగ్రవాద దాడులు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎక్కడా ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గలేదని, అనేకమంది భద్రతా దళ, సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫలితంగా దేశంలో పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. జీడీపీ కూడా 5.7 శాతానికి పడిపోయిందన్నారు. తద్వారా కోట్లాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన ఈ చర్యలను నిరసిస్తూ నవంబరు 8న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రాజెక్టుల కోసం సర్వం కోల్పోతున్న నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఇటీవల 30 గంటలపాటు ధర్నా చేసినప్పటికీ పాలకులు పట్టించుకోకవడానికి నిరసనగా వామపక్షాల ఎంపీలను వంశధార, పోలవరం ప్రాజెక్టులను సందర్శించాలని కోరామన్నారు.