ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్భ్రావృద్ధికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 27: ముంబయి పర్యటనలో భాగంగా రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్భ్రావృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం, తదితర అంశాలు వివరించారు. ఐటికి సంబంధించి తీసుకువచ్చిన విధానాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. దీనిపై అంబానీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్‌బిఎల్ బ్యాంక్ హెడ్ ఆఫ్ స్ట్రాటజీ రాజీవ్ అహూజా, పెర్సిసెంట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ సింగ్, బిర్లా గ్రూపు సిఎఫ్‌ఒ సుశీల్ అగర్వాల్, గ్రాసిం ఎండి దిలీప్‌లతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఎపిలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు పెర్సిస్టెంట్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. కంపెనీకి అనుకూలమైన భూమిని చూపిస్తే ప్రభుత్వంతో పని చేసేందుకు సిద్ధమని బిర్లా గ్రూప్ తెలిపింది.