ఆంధ్రప్రదేశ్‌

మీ పనితీరుపై సమాచారం నా దగ్గరుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 27: అటవీశాఖ అధికారుల పనితీరు గురించి తన వద్ద సమగ్ర సమాచారం ఉందని, అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేసి శాఖకు మంచిపేరు తేవాలని రాష్ట్ర పర్యావరణ, అడవులు, శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని మంత్రి తన కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వనం-మనంలో ఇప్పటివరకు సుమారు 23 కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. వనం-మనం ముగింపు కార్యక్రమాన్ని నవంబర్ 4వ తేదీన గుంటూరులో నిర్వహింపతలపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారని, అదేరోజు గుంటూరు నగర వనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఎర్రచందనం గురించి సమీక్షిస్తూ 7వ విడతలో 1957.906 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయం ద్వారా 89.01 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 8వ విడత ఎర్రచందనం విక్రయాలను రెండు విడతల్లో చేపడుతున్నామన్నారు. మొదటి విడతను నవంబర్ 27, 29 తేదీల్లో, రెండవ విడతను డిసెంబర్ 5, 7వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం ప్రీ బిడ్ మీటింగ్, ప్రమోషన్‌కు సంబంధించి తనతో పాటు ముగ్గురు ఉన్నతాధికారుల బృందం నవంబర్ 20 నుండి 25 తేదీల మధ్య చైనాలో పర్యటించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను తిరుపతిలో 25కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన గోడౌన్‌కు 10 రోజుల్లో తరలించాలని, జాప్యం జరిగితే సహించే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు. ఎర్రచందనం విక్రయాలకు సంబంధించి డిజిఎఫ్‌టి పర్మిషన్ల కోసం ఒక ప్రత్యేక అధికారిని ఢిల్లీలో నియమించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రిజర్వు ఫారెస్ట్‌లో 1700 కిమీ పరిధిలో కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, పెరిపెరల్ ట్రెంచెస్ తవ్వడానికి 1.27 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని దీనికి 10 రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూ పార్కుల అభివృద్ధికి సంబంధించి జూ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే సమావేశపరచవలసిందిగా అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ మీద ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనలకు వ్యతిరేకంగా మైనింగ్ జరుపుతున్న కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి సమీక్షిస్తూ రాష్ట్రంలో కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించి తనకు ఒక సమగ్ర నివేదిక అందజేయాలని, పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఒక రాష్టస్థ్రాయి సమావేశాన్ని ఒక వారం రోజుల్లో విజయవాడలో ఏర్పాటు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీని ఆదేశించారు.