ఆంధ్రప్రదేశ్‌

సిఎం, పీఠాధిపతులకే పూర్ణకుంభ స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, అక్టోబర్ 27: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆర్భాటాలు తగ్గించి, ఆధ్యాత్మికత వాతావరణాన్ని పెంపొందించడానికి పూర్ణకుంభ స్వాగతాలను ముఖ్యమంత్రి, పీఠాధిపతులకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. తనతో సహా మంత్రులెవరికీ ఇకపై పూర్ణకుంభ స్వాగతాలు ఉండవన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో శుక్రవా రం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. దేశంలో 83 వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి ఏడు లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారని, తద్వారా రహదారులకు మహర్దశ పట్టడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. బిజెవైఎం ద్వారా యువ చైతన్య సదస్సులు, ఒబిసి మోర్చా ద్వారా బిసి చైతన్య సదస్సులను బిజెపి విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. యువత, ఒబిసిలు బిజెపి పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని, ప్రధాని మోదీ అమ లు చేస్తున్న పథకాలే విజయానికి దోహదపడతాయని మంత్రి మాణిక్యాలరావు ధీమా వ్యక్తం చేశారు.