ఆంధ్రప్రదేశ్‌

బత్తలవల్లంలో కేంద్ర వైద్య బృందం తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం, అక్టోబర్ 27: చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో ఇటీవల డెంగ్యూ జ్వరంతో మరణాలు పెరిగిపోయాయి. దీనిపై స్థానిక అధికారులు వక్రీకరించి విషజ్వరంగా జిల్లా అధికారులకు నివేదికలు పంపించారు. అయితే మాజీ ఎంపి చింతా మోహన్ ఫిర్యాదును అందుకున్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం నిపుణులు బత్తలవల్ల గ్రామాన్ని సందర్శించి అవి డెంగ్యూమరణాలేనని నిర్ధారించారు. ఈ క్రమంలో మండలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న జిల్లావైద్య శాఖాధికారి అరుణాసులోచన దేవిపై ఆయన మండిపడ్డారు. ఇక్కడ జ్వరపీడితుల రక్తనమూనాలు పూణేలోని లెబొరేటరీకి పంపిస్తామని కేంద్ర వైద్యబృందం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్పుడు నివేదిక ఇచ్చినవారిపై కఠినచర్యలు తప్పవన్నారు.