ఆంధ్రప్రదేశ్‌

పేట్రేగిన మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 27: మావోయిస్టులు మరోసారి పేట్రేగి ఆంధ్రా- ఒడిశా సరిహద్దు చిత్రకొండ సమీపంలోని ఎస్సార్ పైప్‌లైన్‌ను శుక్రవారం పేల్చివేసారు. దీంతో ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకు పలు సంఘటనలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమై భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరండోల్ నుంచి ఐరన్ ఓర్‌ను విశాఖ తరలించేందుకు ఎస్సార్ కంపెనీ ఒడిశాలోని చిత్రకొండ మీదుగా 290 కిలో మీటర్ల పైప్‌లైన్ నిర్మించింది. ఈపైప్‌లైన్ ద్వారా లక్షలాది రూపాయల విలువ చేసే ముడి ఇనుము సరఫరా జరుగుతుంది. చిత్రకొండ అటవీ ప్రాంతంగా ఉన్న పైప్‌లైన్‌ను మావోయిస్టులు పేల్చివేయడంతో విశాఖపట్నానికి వెళ్ళే ముడి ఇనుము నిలిచిపోయింది. ఇదిలా ఉండగా ఈఘటనపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. పైప్‌లైన్ ముడి ఇనుము సరఫరా అవుతుండగా ఒత్తిడికి పైప్‌లైన్ పగిలి ఉంటుందని పోలీసులు భావిస్తుండగా ప్రజలు మాత్రం మావోయిస్టులే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని చర్చించుకుంటున్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.