ఆంధ్రప్రదేశ్‌

టాపర్ల కోసం కార్పొరేట్ కక్కుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, అక్టోబర్ 27: ప్రైవేటు విద్యా సంస్థలు తమ పేరుప్రతిష్ఠలు పెంచుకోవడం ఒక సంస్థలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను మాయమాటలతో తమ సంస్థల్లో చేర్చుకోవడం పరిపాటిగా జరుగుతున్న విషయమే. అయితే ఒక నెల రోజుల క్రితం నెల్లూరు నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల మధ్య పోలీసు కేసుల వరకు వెళ్లింది. నెల్లూరు చాకిలి వీధికి చెందిన ఎండి రియాజ్ అహ్మద్ కుమారుడు ఎండి ఫజిల్ నారాయణ విద్యా సంస్థలో పదోతరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి ప్రతిభను తెలుసుకున్న శ్రీచైతన్య విద్యార్థి సంస్థల యాజమాన్యం ఆ విద్యార్థినిపై కనే్నసింది. అందులో భాగంగా ఫజిల్ దీపావళి పండుగ సందర్భంగా ఇంటికి రావడంతో అతని రాకను గమనించి శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన కొంత మంది విద్యార్థికి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మీ బిడ్డను ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువు నేర్పిస్తామని, అదే కాకుండా విదేశాలలో చదువు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని నమ్మబలికి ఫజిల్‌ను హైదరాబాద్‌కు తీసుకొని వెళ్లారు. అతనితోపాటు తేజ, శివకుమార్ అనే మరో ఇద్దరిని తీసుకెళ్లారు. వీరి ముగ్గురిని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో చదివిస్తున్నారు. బిడ్డలను చూసుకోవడం కోసం ఫజిల్ తల్లి 24వ తేదీ హైదరాబాద్‌కు వెళ్లి శ్రీచైతన్య టెక్నో స్కూల్‌కు వెళ్లగా అక్కడ సిబ్బంది ఆమె కుమారుడిని చూపించడానికి నిరాకరించడంతో ఆమె 25వ తేదీ నెల్లూరు ఒకటో నగర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరుసటి రోజే ఫిర్యాదు వెనక్కు తీసుకోవడం, తల్లిదండ్రుల సమ్మతితోనే శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో చేరినట్లు విద్యార్థులతో ప్రకటన ఇప్పించడం వడివడిగా జరిగిపోయింది. ఈ తతంగం అంతా చూసిన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ఫజిల్ తండ్రి అయిన ఎండి రియాజ్ అహ్మద్‌తో ఒకటో నగర పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేయించారు. గతంలో కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఏ విద్యార్థి అయితే మంచి మార్కులతో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో విజయం సాధిస్తారో ఆ విద్యార్థి తమ విద్యా సంస్థల విద్యార్థేనని ప్రకటించుకోవడం జరుగుతూ ఉండేది. నారాయణ, శ్రీచైతన్య ఇలా అనేక ప్రైవేటు విద్యాలయాలు ఈ వరవడిని సాగిస్తునే ఉండేవి. ప్రభుత్వం ఇలాంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల సిఇఓ విజయభాస్కర్‌రెడ్డి స్పందిస్తూ శ్రీచైతన్య విద్యా సంస్థల యాజమాన్యం తమ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులను తీసుకొని వెళ్లడం అనైతిక చర్య అని దీనిపై ఇప్పటికే విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.