ఆంధ్రప్రదేశ్‌

కిలిమంజారో అధిరోహించిన విశాఖ బాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 27: ప్రపంచంలోని ఎతె్తైన పర్వతాల్లో ఒకటైన ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని విశాఖకు చెందిన పదేళ్ల బాలిక కామ్య అధిరోహించింది. విశాఖలోని తూర్పు నౌకదళంలో పనిచేస్తున్న కమాండర్ ఎస్.కార్తికేయన్ కుమార్తె కామ్య తన తల్లి లావణ్య కార్తికేయన్‌తో కలిసి ఆఫ్రికాలోని 5685 మీటర్లు/18652 అడుగుల ఎత్తులో ఉన్న వౌంట్ కిలిమంజారోను అధిరోహించింది. కామ్య తన తల్లితో కలిసి ఈనెల 20న టాంజానియాకు చేరుకుంది. అక్కడి నుంచి కిలిమంజారో నేషనల్ పార్క్ నుంచి 21న పర్వతారోహణకు బయల్దేరింది. పర్వతారోహణ సమయంలో భయంకరమైన శీతలగాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య నాలుగు రోజులపాటు ప్రయాణించి కిలిమంజారో పర్యత శిఖరంమీద ఉన్న గిల్‌మెన్ పాయింట్‌ను 25న చేరుకుని, అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేసింది. కేవలం ఆరు నెలల వ్యవధిలో కామ్య మూడు అత్యంత ఎతె్తైన శిఖరాలను అధిరోహించింది. ఈ ఏడాది మే నెలలో కామ్య నేపాల్‌లో 17,600 అడుగుల ఎత్తున ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఈ బేస్ క్యాంప్‌ను చేరుకున్న రెండవ అతి పిన్నవయసు బాలికగా కామ్య గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఆగస్ట్‌లో 20 వేల అడుగుల ఎత్తున ఉన్న వౌంట్ స్టాక్ కంగ్రిని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించింది. పిన్నవయసులోనే అత్యంత సాహసోపేతంగా పర్వత శిఖరాలను అధిరోహించిన కామ్యను నేవీ కుటుంబం అంతా ప్రశంసించింది.

చిత్రం..కిలిమంజారో పర్వత శిఖరంపై కామ్య, ఆమె తల్లి లావణ్య కార్తికేయన్