ఆంధ్రప్రదేశ్‌

బాధితులకు పూర్తి రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 28: మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని శంకరగిరి మాన్యాలకు పట్టించడం ఖాయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. శనివారం ఆమె జెడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఎక్కువ మంది ఆటో డ్రైవర్ల వల్లేనని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. కొన్నాళ్ల కిందట విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి ఘటనలో ఆటోడ్రైవర్ ఇద్దరు అమ్మాయిలను గాయపరచిన విషయం విదితమే. ఈ సంఘటనలో మహిళలపై అత్యాచార యత్నం, కిడ్నాప్, గాయపర్చడం, హత్యాప్రయత్నం, అమ్మాయిల చేయి పట్టుకోవడం, ఇనుపరాడ్డు పట్టుకోవడం, గమ్యస్థానాలకు చేర్చకుండా భయబ్రాంతులకు గురి చేయడం వల్ల నిందితుడు సురేష్‌పై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు, ఎస్పీ పాలరాజుకు తాను ఫోన్లోనే సూచించానన్నారు. నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా శిక్షలన్నీ క్రోఢీకరించి కొన్ని ఆచరణలో పెట్టారని, మరికొన్ని పెట్టబోతున్నారన్నారు. బాధితులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు, మహిళా కమిషన్‌పై ఉందన్నారు. ఆటో డ్రైవర్లకు లైసెన్సులు ఇచ్చేటపుడు వారి గత చరిత్ర చూడాలన్నారు.