ఆంధ్రప్రదేశ్‌

సిఐడి డిఎస్పీ అక్రమాస్తులపై ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/నంద్యాల టౌన్, అక్టోబర్ 28: సిఐడి డిఎస్పీ హరినాథ్‌రెడ్డి అక్రమాస్తులపై రాయలసీమ జిల్లాల్లో ఎసిబి అధికారులు శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. హరినాథ్‌రెడ్డి గతంలో నంద్యాలలో డిఎస్పీగా పనిచేశారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో ఆయన పేర రెండు భవనాలు ఉన్నాయి. ఈ ఇళ్లలో సోదాలు జరిపిన ఎసిబి అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదే విధంగా తుగ్గలి మండలం పగిడిరాయిలో ఉన్న హరినాథ్‌రెడ్డి మామ మాజీ విఆర్‌ఓ తిమ్మారెడ్డి ఇంట్లో సైతం సోదాలు జరిపారు. ఇక్కడ రూ.7 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో హరినాథ్‌రెడ్డి పేర 10 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల డిఎస్పీ బంగ్లాలోని నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. హరినాథరెడ్డి ఏడాది క్రితం నంద్యాల నుంచి విజయవాడ సిఐడి విభాగానికి బదిలీ అయ్యారు.
నంద్యాలలో మూడేళ్లకుపైగా పనిచేశారు. నివాసంలో జరిపిన సోదాల్లో రూ. లక్ష నగదు, బంగారు, వెండి వస్తువులు, ఖరీదైన సెల్‌ఫోన్లు లభించాయి. ఆస్తుల పత్రాలు లభించాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని సోదాల్లో దాదాపు రూ.30 కోట్ల వరకు అక్రమాస్తులు బయటపడ్డాయని తెలుస్తోంది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఎస్‌ఐగా ఐదేళ్లు పనిచేసిన హరినాథ్‌రెడ్డి పదోన్నతిపై కడప జిల్లా ప్రొద్దుటూరుకు సిఐగా బదిలీ అయ్యారు. అక్కడి నుంచి డిఎస్పీగా పదోన్నతిపై కడపకు బదిలీ అయ్యారు.
అక్కడి నుంచి నంద్యాల డిఎస్పీగా వచ్చారు. ఇక్కడి నుంచి విజయవాడకు బదిలీ అయ్యారు. హరినాథ్‌రెడ్డి స్వగ్రామం అనంతపురం జిల్లా ఓబులవారిపల్లె మండలం డబురువారిపల్లెలోని అతని సోదరుల ఇళ్లలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.