ఆంధ్రప్రదేశ్‌

ఖరీఫ్‌కు 4.92లక్షల ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 28: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుకు 4.92 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వనున్నారు. శనివారం నెల్లూరులో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాధ్యక్షుల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ పరిధి మరి కొంత పెంచే అవకాశం లేకపోలేదు. ఇన్‌చార్జ్ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ నవంబర్ నెల 2వ తేది నుండి ఖరీఫ్ సాగుకు సాగునీటిని విడుదల చేసేలా తీర్మానం చేసి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించామన్నారు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 50 టి ఎంసీల మేర నీటి నిల్వ ఉంది. జిల్లాలోని కండలేరు జలాశయం కింద తాగునీటిని అందించాలని మెట్ట ప్రాంత ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి పరిగణనలోకి తీసుకున్న కమిటి కండలేరుకు 6 టి ఎంసీల మేర నీటిని విడుదల చేశామని, అదనంగా మరో టి ఎంసీ నీటిని విడుదల చేస్తామని హామీనిచ్చారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సాగునీటి సంఘాలు అవినీతికి పాల్పడుతున్నాయని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేశారు.