ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయింపులకు పితామహుడు వైఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి దానికి శ్రీకారం చుట్టింది, అసలు ఫిరాయింపులకు పితామహుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నప్పుడు తెదేపా శాసనసభ సమావేశాలను బహిష్కరించకుండా, ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించిందని శనివారం ఒక ప్రకటనలో శిద్దా పేర్కొన్నారు. అధికారమే పరమావధిగా ప్రతిపక్ష వైకాపా స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై చేసిన వ్యాఖ్యల మీద, ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి పంపిన తప్పుడు నివేదికలపైన, బొత్స బ్రోకరేజ్‌పైన ఎక్కడ నిలదీస్తారో, వాటి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియకే వైకాపా పలాయనవాదం చిత్తగిస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తుందోని ఆరోపించారు. వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వరని, జగన్ ఒక నియంతలాగ వ్యవహరిస్తారని మంత్రి ఆరోపించారు. జగన్ నియంతృత్వ పోకడలు భరించలేక, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి వచ్చారని, త్వరలోనే వైకాపాలో అంతర్గత తిరుగుబాటు జరగనుందని మంత్రి శిద్దా జోస్యం చెప్పారు. గడచిన మూడున్నర సంవత్సరాల్లో ప్రతిపక్ష నేత రాష్ట్భ్రావృద్ధికి ఒక్క నిర్మాణాత్మక సూచన చేసిన పాపాన పోలేదని మంత్రి విమర్శించారు. పరామర్శలు, దీక్షలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టడానికే జగన్ పరిమితమయ్యారే తప్ప ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవని మంత్రి విమర్శించారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ చేస్తుంది ప్రజా సమస్యలపై యాత్ర కాదని సిబిఐ కేసుల విచారణ నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న యాత్ర అని శిద్దా ఎద్దేవా చేశారు.