ఆంధ్రప్రదేశ్‌

కాపు యువతను పారిశ్రామికవేత్తలను చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: కాపు నిరుద్యోగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం పెనమలూరులోని ఎలక్ట్రిసిటీ కాలనీ కాలేజీ వసతి గృహంలో ఎంఎస్‌ఎంఇ గ్రూపు పథకం కింద ఎంపికైన గ్రూపు సభ్యులకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే శిక్షణా కార్యక్రమానికి చైర్మన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రామానుజయ మాట్లాడుతూ కాపు యువతను స్వయం ఉపాధి ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. సుమారు 5వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పారిశ్రామికవేత్తల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని చైర్మన్ అన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా, ప్రతి మహిళ 10 నుండి 20వేల రూపాయలు సంపాదించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. 10వ తరగతి నుండి ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విదేశీ విద్యలో భాగంగా ఈ ఏడాది వెయ్యి మందిని విదేశాలకు పంపించాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 2కోట్ల రూపాయల నిధులతో కాపు భవనాలు నిర్మిస్తున్నామన్నారు. బిసి విద్యార్థుల మాదిరిగానే కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో 23 గ్రూపులకు చెందిన 75 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ ఇడి పెంటోజీరావు, డిపిఆర్వో మేడపాటి, భాస్కరనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఎల్‌డిఎం బివి సుబ్రమణ్యం పాల్గొన్నారు.