ఆంధ్రప్రదేశ్‌

రేపు సింగపూర్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 28: మలేషియా నుంచి విడిపోయిన తరువాత సింగపూర్‌లో జరిగిన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకే అమరావతి రైతులను సింగపూర్‌కు తీసుకెళ్తున్నట్టు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ చెప్పారు. శనివారం నగరంలోని సిఆర్‌డిఎ కార్యాలయంలో సింగపూర్ టూర్‌కు ఎంపికైన రైతుల్లో తొలి బృందం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సింగపూర్ అభివృద్ధిపై విజ్ఞాన యాత్రగా తీసుకెళ్తున్నామన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 4రోజుల సింగపూర్ యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అమరావతి నుంచి బస్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించనున్నట్టు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం సిఆర్‌డిఎ ప్రతినిధులుగా రాజధాని రైతులు పర్యటనకు వెళ్తున్నారన్నారు. సింగపూర్‌లో పరిశీలించిన అభివృద్ధి విధానాలను ఆయా గ్రామాల్లో అందరికీ వివరించాలని సూచించారు. సింగపూర్‌లో తెలుగు వారందరూ రాజధాని రైతులకు స్వాగతం పలకనున్నట్టు తెలిపారు. అమరావతికి పెట్టుబడులు రప్పించి అభివృద్ధిపర్చే కృషిలో భాగంగా సింగపూర్‌లో, అమరావతిలోనూ రెండుచోట్లా సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు. మరో 15రోజుల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నారు. త్వరలోనే సింగపూర్‌కు నేరుగా విమానం నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.