ఆంధ్రప్రదేశ్‌

సండ్ర నిర్ణయం కోసం ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 28: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభంతో ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉండగా అనేక మంది నేతలు, పార్టీ కార్యకర్తలు జాతీయ ఉపాధ్యక్షుడు సండ్ర వెంకటవీరయ్య నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. పాత ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో గట్టి పట్టు కలిగిన నాయకునిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య.. రేవంత్‌రెడ్డితో పార్టీని వీడతారా.. లేదా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీలో ప్రజాదరణ కలిగిన నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి పార్టీని వీడటంతో ఆయా జిల్లాల్లో అనేక మంది పార్టీని వీడుతారని అందరూ భావించారు. రేవంత్‌రెడ్డితో పాటు పార్టీని వీడేవారి జాబితాలో వెంకటవీరయ్య పేరుకూడా ఉన్నది. కానీ శనివారం విజయవాడలో జరిగిన సమావేశానికి వెం కటవీరయ్య హాజరుకాకపోగా పార్టీ శ్రేణులకు మాత్రం తాను టిడిపిలోనే ఉంటానని చెప్పడం విశేషం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో అనేక మంది ఇప్పటికే సండ్ర నిర్ణయం మేరకే తాము ఉంటామని చెప్పడం గమనార్హం. దీనిపై చంద్రబాబు కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే సండ్రతో ఫోన్‌ద్వారా సంభాషించినట్టు తెలిసింది. జరుగుతున్న పరిణామాలపై సండ్ర స్పందించనప్పటికీ ఆయన నిర్ణయం మేరకే ఎక్కువ మంది ఆధారపడటం గమనార్హం. సత్తుపల్లి శాసన సభ్యుడిగా ఉన్న ఆయన రేవంత్‌రెడ్డి ప్రకటించిన జాబితాలో ఉన్నప్పటికీ దానిపై కూడా స్పందించలేదు. ఇదిలా ఉండగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని జిల్లాల నేతలు మాత్రం ఆదివారం వెంకటవీరయ్యతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సండ్ర పార్టీని వీడితే ఆయనతో పాటే అనేక మంది పార్టీని వీడే అవకాశం ఉంది. వీరంతా ఇప్పటికే ఆయనతో ఫోన్‌లో సంభాషించినప్పటికీ అధినేతతో మాట్లాడిన తరువాతే నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది.