ఆంధ్రప్రదేశ్‌

ప్రజా సమస్యలపై యుద్ధానికి కాంగ్రెస్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 28: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులపై యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. నాడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేదరికం, దేశ శత్రువులపై యుద్ధం చేస్తే.. నేటి పాలకులు ప్రజలు వాడే కరెన్సీపై కూడా యుద్ధం చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపైనా, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అఖిల భారత యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ఐవి ప్యాలెస్‌లో మా తుజే సలాం పేరిట నిర్వహించిన యువజన సమ్మేళనంలో విద్యార్థుల బంగా రు భవిష్యత్తు కోసం ఇందిరమ్మ స్ఫూర్తిని కొనసాగించేలా పోరాటం కొనసాగిస్తామంటూ విద్యార్థులతో రఘువీరా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత, అభ్యున్నతికై విశేష కృషి చేయడమే కాకుండా ప్రాణ త్యాగం చేసిన ఇందిరాగాంధీ ఫొటో ను పోస్టల్ స్టాంప్‌పై తొలగించేందుకు నేటి కేంద్ర పాలకులు చేస్తున్న కుటిల యత్నాలు శోచనీయమన్నా రు. ప్రజలను యుద్ధం చేయాలని పిలుపునిస్తున్న నేటి పాలకుల పాలన తీరు ఎక్కడికి వెళ్తుందో నోట్ల రద్దుతో స్పష్టమైందన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, తరువాత మరో మాట మాట్లాడుతున్న పాలకులు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే సామాన్య ప్రజానీక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఎద్దేవా చేశారు.