ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రా మహిళల ‘చలో అస్సాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 30: దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శం కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా మెప్మా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహిళా పొదుపు సంఘాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన బాబు విధానాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి మెప్మా సిద్ధమవుతోంది. అర్బన్ లైలీహుడ్ మిషన్‌లో భాగమైన మెప్మా ద్వారా రాష్ట్రంలో పట్టణ పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. మెప్మా ఆధ్వర్యంలో మొదటి విడతగా రాష్ట్రంలోని డ్వాక్రా గ్రూపుల్లో చురుకైన మహిళలను సుశిక్షితులను చేసి హిందీ నేర్పించి, 40 మందిని ఎంపిక చేసి అస్సాం రాష్ట్రానికి పంపిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఎంపిక చేసిన వీరిని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌గా పిలుస్తున్నారు. అస్సాం రాష్ట్రంతో ఈ ఒప్పందం ఒక సంవత్సరం ఉంటుంది. విడతల వారీగా సంవత్సరం పాటు ప్రతినెలా అస్సాంలో వీరు మహిళాభివృద్ధిపై తమ అభిప్రాయాలు, అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి అక్కడి మహిళలకు వివరిస్తారు. మొదటి విడతగా అస్సాంలోని బంగాయ్ గాన్, తేజ్‌పూర్ డిబ్రుఘర్, శివసాగర్, గోలాఘాట్ జిల్లాల్లో ఇరవై గ్రూపులుగా ఏర్పడి పర్యటిస్తారు. అధికారులను కాకుండా మొదటి నుంచి సంఘాల్లో ఉండి ఆర్థికంగా సంఘాలను బలోపేతం చేసిన మహిళలను రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతినిధులుగా పంపిస్తోంది. సోమవారం ఈ బృందానికి దిశానిర్దేశం చేసి విజయవాడ నుండి అస్సాం పంపించే కార్యక్రమంలో మెప్మా ఎండి చినతాతయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా వెళుతున్నారని, ఇప్పటికే చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంవత్సరం నుంచి 12 విడతలుగా మన రాష్ట్ర మహిళలు తమ విజయాల ద్వారా సాధించిన అభివృద్ధిని అక్కడి మహిళలకు వివరిస్తున్నారని, త్వరలోనే రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, మేఘాలయ రాష్ట్రాలకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. డ్వాక్రా కార్యక్రమం దేశంలో 55 శాతం అభివృద్ధి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో సాధించగా మిగిలిన 45 శాతం దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఉందని చెప్పిన చినతాతయ్య మన మహిళాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాయని తెలిపారు. మహిళా సాధికారత, వారి అభివృద్ధి కోసం 2014లో ఏర్పాటైన మెప్మా కార్యక్రమాల తీరు దేశం దృష్టిని ఆకర్షించిందన్నారు. రాష్ట్రంలో 350 మందిని ఎంపిక చేసి లక్షల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు పంపిస్తోంది. వీరు అక్కడ ఉన్న సంఘాలను బలోపేతం చేయడం, కొత్త సంఘాలు ఏర్పాటు చేయడంలో సహాయపడటంపై దృష్టి పెడతారని చినతాతయ్య వివరించారు. మెప్మా ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలనకు అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. అయిదు విభాగాలుగా ప్రణాళికలు రచిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. డ్వాక్రా విషయంలో అతి త్వరలోనే ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తుందనడంలో అతిశయోక్తి లేదని అన్నారు.