ఆంధ్రప్రదేశ్‌

శరవేగంగా పోలవరం వంతెన పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 30: పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ ఎలైన్‌మెంట్ పరిధిలోని వంతెన పనులను శరవేగంగా పూర్తిచేయడానికి ప్రత్యేక ఏజెన్సీలకు అప్పగించారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీరివ్వాలనే లక్ష్యానికి అనుగుణంగా ఎల్‌ఎంసి పరిధిలో మిగిలిపోయిన పనులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. మొత్తం పదిచోట్ల జాతీయ రహదారిని క్రాస్‌చేసుకుంటూ పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ఎలైన్‌మెంట్‌వుంది. ఇందులో 57 కిలోమీటర్ల పరిధిలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నీటిని ఏలేరుకు అనుసంధానం చేయాల్సివుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో ప్రధానంగా మూడుచోట్ల వంతెనలు నిర్మాణం చేయాల్సివుంది. లక్ష్యం మేరకు ఏలేరుకు గోదావరి నదిని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా అనుసంధానం జరగాలంటే ముందుగా ఈ మూడు వంతెనల నిర్మాణం పూర్తికావాల్సివుంది. ప్రస్తుతానికైతే వంతెనల వద్ద రోడ్డు అడుగు నుంచి పైపులైన్లు వేసి ప్రత్యామ్నాయంగా నీటిని సరఫరాచేస్తున్నారు. వాస్తవానికి పోలవరం మొదట్లో పిలిచిన టెండర్ల ప్రకారం ప్యాకేజీల పరిధిలో ఉన్న నిర్మాణాలను ఆయా ఏజెన్సీలు పూర్తిచేయాల్సివుంది. అయితే ముందుగా ఏలేరుకు నీటిని తీసుకెళ్లేందుకు అత్యవసరమైన మూడు వంతెనలను కొత్త ప్యాకేజీల ద్వారా కొత్త ఏజెన్సీలకు ఇచ్చి పనులు చేయిస్తున్నారు. అందులో భాగంగా జీరో నుంచి 25.6 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న పోలవరం ఎడమ కాల్వ ఒకటో ప్యాకేజీలో మిగిలిపోయిన పనులను సూర్యా కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ మొత్తం 28 నిర్మాణాలు చేయాల్సివుంది. ప్రస్తుతం 22 నిర్మాణాల పనులుచేపట్టగా, ఇప్పటికే 15 పూర్తయ్యాయి. 11 నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి గ్రామం వద్ద వంతెన, కోరుకొండ మండలం గాదరాడ వద్ద వంతెన నిర్మాణ పనులు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలకు సంబంధించి ఇంకా 18 డిజైన్లను కాంట్రాక్టు ఏజెన్సీ ఆమోదం తీసుకోవాల్సివుంది. 25.6 కిలోమీటర్ల నుంచి 58 కిలోమీటర్ల వరకు వున్న రెండో ప్యాకేజీలో మురారి వద్ద జాతీయ రహదారిని క్రాస్ చేసే వంతెన పనులను ప్రత్యేక టెండర్ పిలిచి పనులు కేటాయించారు. ఇక్కడ వంతెన పనులు ఊపందుకున్నాయి.

చిత్రం..ఎడమ ప్రధాన కాలువ పరిధిలో శరవేగంగా జరుగుతున్న వంతెన పనులు