ఆంధ్రప్రదేశ్‌

తలచుకుంటే సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 30: ఎడారి ప్రాంతాలైన దుబాయ్, అబుదాబి అద్భుత ప్రగతి సాధించాయి.. మత్స్యకార గ్రామం సింగపూర్ అభివృద్ధికి చిరునామా అయ్యింది.. అన్ని వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతి సాధించాలి.. అందుకు అందరూ సహకరించాలి.. భాగస్వాములు కావాలి.. అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ మారాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు - ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సోమవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక విజయం మరో విజయానికి బాటలు వేస్తుందన్నారు. కిడాంబి శ్రీకాంత్, పివి సింధు వరుస విజయాలే అందుకు ఉదాహరణ అన్నారు. ఇదే స్ఫూర్తితో అందరూ పని చేయాలి, తమ రంగాల్లో రాణించాలన్నారు. ఏ రంగంలోనైనా కావాల్సినంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందిస్తే అద్భుత పురోగతి సాధించవచ్చనే దానికి ఇదే ఉదాహరణగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనకు నరేగాను సద్వినియోగం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. చక్కని పనితీరు కనబరుస్తున్న జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అంగన్‌వాడిలో చిత్తూరు జిల్లా, పల్లెనిద్రలో కర్నూలు, నీరు - చెట్టులో అనంతపురం, స్వచ్ఛతలో గుంటూరు జిల్లాలు ముందున్నాయని ప్రశంసించారు. ‘ప్రతి ఊళ్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, దానిని గుర్తించాలి, మరింత మెరుగుపరచాలి, అభివృద్ధి పథంలో నిలపాలి’ అని ఆయన కోరారు. ఏ ఊరిలో మేలైన విధానం అమలు చేసినా దానిని అందరూ అధ్యయనం చేయాలని, అన్ని జిల్లాల్లో ప్రచారం చేయాలని, అమలు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కోనంకి గ్రామంలో ‘కౌ డంగ్ ఉబరైజేషన్’ మంచి ఫలితాలను ఇచ్చిందంటూ, చెత్త నుంచి సంపద పొందడంలో కోనంకి ఇతర గ్రామాలకు ఆదర్శం కావాలని అన్నారు. 1500 కుటుంబాలు ఉండే కోనంకిలో ప్రతి పశువును ట్యాగ్ చేశారని, నెలకు రూ. లక్ష ఆదాయం పొందుతున్నారని చెప్పారు. ఏడాదికి రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు కౌడంగ్ ఉబరైజేషన్ ద్వారా ప్రతి గ్రామం అర్థికాభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ‘గొల్లపూడి, పొన్నవరం, వీరులపూడిలో ద్రవవ్యర్థాల నిర్వహణ సత్ఫలితాలు ఇచ్చింది. చీరాలలో తడి, పొడి చెత్త వినియోగంపై శిక్షణ విజయవంతం అయ్యింది. చల్లపల్లి, పెదపారుపూడి, మోరి గ్రామాలు స్వచ్ఛ్భారత్‌లో ముందంజలో ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామం అభివృద్ధి సాధించాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్, అయోవా విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్ విశ్వవిద్యాలయం మన రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నాయంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పట్ల పూర్తి సానుకూలత ఉందని తెలిపారు. మూడు దేశాల పర్యటనలో మనపై విశ్వాసం కనిపించిందని, దానిని నిలబెట్టుకోవాలని, మరింత ప్రగతి సాధించాలని అన్నారు. మైనింగ్ వ్యాపారి అనిల్ అగర్వాల్ దేశంలో 4వేల నెక్ట్స్ జనరేషన్ అంగన్ వాడి కేంద్రాల అభివృద్ధికి చేయూత ఇస్తున్న విషయం చంద్రబాబు ప్రస్తావించారు. రూ. 10 లక్షలతో ఒక్కో అంగన్‌వాడీ కేంద్రాన్ని అగర్వాల్ ట్రస్ట్ ద్వారా ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు చిన్నారులకు ఆడియో, వీడియో ద్వారా బోధన చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 అంగన్‌వాడీలు అభివృద్ధికి అనిల్ అగర్వాల్ సంసిద్ధత వ్యక్తం చేయగా, 1000 అంగన్‌వాడీ కేంద్రాలను నెక్ట్స్ జనరేషన్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని కోరినట్లుగా ముఖ్యమంత్రి తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, రియల్ టైం గవర్నెన్స్, వ్యవసాయం అనుబంధ శాఖల ఉన్నతాధికారులు రామాంజనేయులు, జవహర్‌రెడ్డి, అహ్మద్ బాబు, ఇస్రో రాజశేఖర్, శంకర్ నాయక్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.