ఆంధ్రప్రదేశ్‌

పోలవరం అక్రమాలు, అవినీతిపై కేంద్రం విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కమిషన్లు ఇచ్చే పాడి ఆవులా చూస్తున్నారని వైకాపా అధికార ప్రతినిధి పార్ధసారథి ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రూ.16వేల కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ. 50 వేల కోట్లకు పైగా పెంచారని ఆరోపించారు. తాజాగా మరో రెండు నుంచి మూడు వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరుగుతుందంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును 2017 నుంచి 2019 లోపల పూర్తి చేస్తామని ఏ ఏడాది కా ఏడాది డెడ్‌లైన్లు చెబుతున్నారే తప్ప చేస్తున్నదేమీ లేదన్నారు.
పట్టిసీమ, పురుషోత్తమపట్నంలను తెరపైకి తెచ్చారన్నారు. రాష్ట్రప్రభుత్వం మీద ఒక్క పైసా భారం పడకుండా కేంద్రమే ప్రాజెక్టును పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి ఉంటే చంద్రబాబు తన కమిషన్ల కోసం పోలవరం ఆదాయాన్ని మార్గంగా ఎంచుకుని విన్యాసాలు చేస్తూ దాన్ని జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేసి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎవరు పూర్తి చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. కాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. కేంద్రానికి చెందిన నాలుగు శాఖలను మేనేజ్ చేసి పోలవరం నిర్మాణాన్ని చేపట్టారని రిటైర్డు సీనియర్ ఐఎఎస్ అధికారి స్పష్టంగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఈ ఆరోపణపై ప్రభుత్వం స్పందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆదాయవనరుగా మార్చుకున్నారన్న విషయం కేంద్రానికి తెలిసిపోయిందన్నారు. పోలవరం పేరుతో చంద్రబాబు చేస్తున్న అక్రమాలపై కేంద్రం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.