ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో ఎల్‌ఇడి బల్బుల కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యుత్ ఆదాకు సంబంధించి ఎల్‌ఇడి బల్బులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ల ప్రక్రియ ద్వారా సేకరిస్తున్నారని, ఇందు లో పారదర్శకత లేదని, రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వ సంస్ధను అడ్టుపెట్టుకుని కుంభకోణానికి పాల్పడుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఇంధన పొదుపుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి అచ్చెంనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఇఇఎస్‌ఎల్ ఎల్‌ఇడి బల్బులను సేకరించి రాష్ట్రానికి పంపిణీ చేయిస్తోందన్నారు. దీనిపై స్పందించిన జగన్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ సంస్ధను అడ్డుపెట్టుకుని రాష్ట్రప్రభుత్వం స్కాంకు పాల్పడుతున్నట్లు కనపడుతోందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేసేందుకు నామినేషన్ పద్ధతి అనుసరించారా, టెండర్లు పిలిచారా ? లోయస్టు బిడ్‌లకు ఇచ్చారా అని అడిగారు. మంత్రి అచ్చెంనాయుడు బదులిస్తూ కేంద్రప్రభుత్వ సంస్ధ ఇఇఎస్‌ఎల్ సంస్ధ ఎల్‌ఇడి బల్బులు సరఫరా చేస్తోందని, తమకు సంబంధం లేదన్నారు. దీనిపై జగన్ మాట్లాడుతూ ఏపి జెన్కో బొగ్గు సేకరణలో అవకతవకలకు పాల్పడిందని, జెన్కోలో బిహెచ్‌ఇఎల్‌కు సంబంధించి కూడా స్కాం జరజిగిందన్నారు. బొగ్గు రేటు తగ్గినా ఇతర సంస్ధలచేత బొగ్గు సరఫరా చేయిస్తున్నారన్నారు. మంత్రి అచ్చెంనాయుడు బదులిస్తూ, జగన్ చేసిన అభియోగాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రం ఇంధన పొదుపులో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 5స్టార్ రేటెడ్ పంపుసెట్లను అమర్చినందువల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. నరసాపురం డివిజన్‌లో ఇంధన పొదుపులో భాగంగా తక్కువ విద్యుత్ ఆదా చేసే ఫ్యాన్లను పంపిణీ చేస్తున్నామన్నారు.