రాష్ట్రీయం

అంతర్‌జిల్లా బదిలీలకు సిఎం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ఉపాధ్యాయుల అంతర్‌జిల్లా బదిలీలకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. ఫైలు విద్యాశాఖకు చేరుకోవడంతో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపో విడుదల కానున్నాయి. జిఎడిలో పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు కూడా వీటితో కలిపి చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి పి బాబురెడ్డి చెప్పారు. అనేక సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ ఉత్తర్వులు ఊరటకలిగిస్తాయని వారు చెప్పారు. జిల్లాల్లో వెంటనే అమలుచేయడం ద్వారా వారి సీనియార్టీని రక్షించాలని విద్యాశాఖాధికారులకు నేతలు విజ్ఞప్తి చేశారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వై శ్రీనివాసులురెడ్డి, బి నాగేశ్వరరావు తదితర నాయకులు పాఠశాల విద్యాశాఖ అధికారులను కలిసి మంగళవారం నాడే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.