ఆంధ్రప్రదేశ్‌

ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, అక్టోబర్ 31: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో మహిళలపై దాడుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉండటం దారుణమన్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మహిళా సాధికార సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మీరాకుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలను పూర్తిగా విస్మరించిందన్నారు. ‘కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా’ అని వ్యాఖ్యానించే ముఖ్యమంత్రి ఇక్కడ ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదా నినాదాన్ని పూర్తిగా పక్కనపెట్టి ప్యాకేజీ కోసం ముఖ్యమంత్రి పాకులాడుతున్నారని విమర్శించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మజ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు ఎంఎం పళ్లంరాజు, జెడి శీలం, మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, శైలజానాథ్, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పంతం నానాజీ, స్థానిక పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్