ఆంధ్రప్రదేశ్‌

తొలి త్రైమాసికంలో లక్ష్యాలు మించి వృద్ధిరేటు 11.72 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 31: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో లక్ష్యాలను మించి 27.60 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం ఉదయం ప్లానింగ్ శాఖ అధికారులతో మొదటి, రెండవ త్రైమాసిక ఫలితాలను మంత్రి సమీక్షించారు. అన్ని రంగాల్లో కలుపుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో 11.72 శాతం వృద్ధిరేటు సాధించినట్లు తెలిపారు. 2016-17 మొదటి త్రైమాసికంలో జీవిఏ రూ.1,07,099 కోట్లతో, వృద్ధిరేటు 12.26 శాతం కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,480 కోట్ల జీవిఏతో, 16.23 సాధించాలన్నది లక్ష్యంగా నిర్ణయించినట్లు వివరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీవిఏ రూ.18,319 కోట్లతో 22.96 శాతం వృద్ధిరేటు సాధించగా, ఈ ఏడాది రూ.23,120 కోట్లతో 26.21 శాతం సాధించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పారిశ్రామిక రంగంలో 8.05 శాతం, సేవల రంగంలో 8.67 శాతం వృద్ధిరేటు సాధించినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో మొదటి త్రైమాసికంలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో 2.3 శాతం, పరిశ్రమల రంగంలో 1.6 శాతం, సేవా రంగంలో 8.7 శాతంతో మొత్తం 5.6 శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించినట్లు మంత్రి వివరించారు. రెండవ త్రైమాసికం లక్ష్యాలను, సాధించిన ప్రగతిని ఇప్పటివరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సమీక్షించారు.
వ్యవసాయ రంగంలో రాష్ట్రంలో సాగు చేస్తున్న భూమి, పంటల వారీగా సాగు, కొత్తగా సాగులోకి వచ్చిన భూమి, పంటల మార్పిడి, వ్యవసాయ ఉత్పత్తుల వివరాలు పూర్తిగా సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే సేవల రంగంలో వృద్ధిరేటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో వెనుకబడిన 7జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1574 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1050 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. వాటిలో రూ.787 కోట్లు ఖర్చు చేయగా, రూ.770 కోట్లకు సంబంధించి యూసీలు కూడా ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలోని 25 మంది లోక్‌సభ సభ్యుల నిధులు రూ.300 కోట్లు మంజూరు కాగా, రూ.240 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఏడుగురు రాజ్యసభ సభ్యులకు రూ.107 కోట్లు మంజూరు కాగా, రూ.93 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తం 32 మంది ఎంపీల నిధులు రూ.333 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక అభివృద్ధి ఫండ్‌కు రూ.500 కోట్లు కేటాయించగా, రూ.437 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ నిధులను శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏఏ నియోజకవర్గాల్లో ఎంతెంత ఖర్చు చేశారో ఆ వివరాలు సేకరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కూడా సమీక్షించారు. వాటిలో 54 శాతం అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్‌లో తెలంగాణలో 3.35 శాతం, తమిళనాడులో 5.22, కర్నాటకలో 2.81, కేరళలో 6.35, మహారాష్టల్రో 4.32 ఉండగా, ఏపీలో 2.59 శాతం మాత్రమే నమోదైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు సి.కుటుంబరావు, ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సిఈఓ సంజయ్‌గుప్త, ప్రణాళికాశాఖ ప్రత్యేక కార్యదర్శి పివి చలపతిరావు, ఆర్థిక, గణాంక శాఖ సలహాదారు డాక్టర్ డి.దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.