ఆంధ్రప్రదేశ్‌

‘లీకు’ వీరుడిపై సర్కారు చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి కుదింపునకు సంబంధించి ఉత్తర్వుల ముసాయిదా లీక్ వ్యవహారంలో మరొకరిపై ప్రభుత్వం వేటు వేసింది. తాజాగా జలవనరుల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే పదవీ విరమణ చేయించేందుకు వీలుగా తయారుచేసిన ఉత్తర్వుల ముసాయిదా గతంలో లీకైన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో అలాంటి ప్రతిపాదన ఏమీలేదని ఉద్యోగులకు ముఖ్యమంత్రి, మంత్రులు నచ్చచెప్పారు. దీంతో ఆ వివాదానికి అప్పట్లో తెరపడింది. అయితే ఆ ఉత్తర్వుల వ్యవహారం అటకెక్కినప్పటికీ లీకేజీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. గతంలో న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరో అధికారిపై వేటు పడింది. అయితే ఉత్తర్వుల ముసాయిదా కాపీలను లీక్ చేశారంటూ సస్పెండ్ చేయడంపై సచివాలయ ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంకటరామిరెడ్డిపై ఉద్దేశ్యపూర్వకంగానే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం కూడా సస్పెన్షన్‌కు కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ- ఆఫీస్ విధానంలోని ఫైళ్లను ఎలా కాపీ చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాయల ఉద్యోగుల సంఘం అత్యవసరంగా సమావేశమైంది. ఉద్యోగులపై ఇలా చర్యలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరేందుకు, రెండ్రోజులు వేచిచూసి తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు సంఘం నేత మురళీకృష్ణ తెలిపారు.