ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో సైన్స్ సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: రాష్ట్రంలో కోల్డ్‌చైన్, మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. తిరుపతిలో సైన్స్ సిటీ, రాజధాని ప్రాంతంలో కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం 3838 ఎకరాల భూమి సిఆర్‌డిఏకు ఉచితంగా అప్పగించేందుకు నిర్ణయించింది. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడ్‌గేజ్ నిర్మాణానికి వివిధ మండలాల్లోని 603 ఎకరాల భూమిని సికింద్రాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్టు డెప్యూటీ చీఫ్ ప్రాజెక్టు మేనేజరుకు ముందస్తుగా అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి బుధవారం సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వివరాలను మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు విలేఖరులకు వివరించారు.
రాష్ట్రంలో మాంసం పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని, పశువులు, పశుదాణాకు సంబంధించి రవాణా, నిల్వ వసతులను కల్పిస్తామని తెలిపారు. మాంసం ఎగుమతుల ప్రోత్సాహానికి సమీకృత మాంస శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో డాల్ఫిన్ తరహా జలచరాలు, సముద్ర ఉత్పత్తులు, జలక్రీడలకు రాష్ట్రం చిరునామాగా మారనుంది. కోల్డ్ చైన్స్ ఏర్పాటుకు కూడా మంత్రి మండలి ఆమోదించింది. దీనిపై సమగ్ర విధానాన్ని రూపొందించి వచ్చే మంత్రి మండలి సమావేశంలో ప్రతిపాదించాలని నిర్ణయించారు. వ్యవసాయం, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖల మంత్రులు అధ్యయనం జరిపి ముసాయిదా రూపొందించనున్నారు. 30రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర్గత జలరవాణా చట్టం కింద ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన మోడల్ ఇన్‌లాండ్ వెస్సల్స్ రూల్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఇన్‌లాండ్ వెస్సల్స్ రూల్స్ రూపొందించారు. జాతీయ జలరవాణా ఫేజ్-4లో భాగంగా ముక్త్యాల నుంచి విజయవాడ వరకు ఏర్పాటు చేసే జలమార్గ నిర్వహణ, పరిశోధన, బీమా, తదితర అంశాలను ఇందులో పొందుపరిచారు. తిరుపతిలో 70 ఎకరాల్లో సైన్స్ సిటీకి ఆమోదం తెలిపారు. భవిష్యత్‌లో దేశంలో జరగబోయే శాస్త్ర ప్రయోగాలకు, ఆవిష్కరణలకు ఇది హబ్‌గా మారనుంది. కృష్ణా జిల్లా కైకలూరులో కొత్తగా ఏర్పాటైన సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 25 పోస్టులను మంజూరు చేస్తూ మంత్రిమండలి ఆమోదించింది. విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలను ఎపిపిఎస్‌సి చేపట్టేందుకు వీలుగా అదనపు అధికారాలు కల్పించే బిల్లును రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తేలికపాటి యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలంలో ఏర్పాటు కానుంది. ఇందుకు కేటాయించిన భూములకు చెల్లించాల్సిన అపరాధ వడ్డీని మాఫీ చేస్తూ నిర్ణయించారు. స్వచ్ఛాంద్రప్రదేశ్ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిర్ణయించారు. జలవనరుల శాఖ బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు పొందే పరిమితిని తొలగిస్తూ చేసిన సవరణను ఆమోదించారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో 21 ఎకరాల భూమిని ఎంఎస్‌ఎంఈ పార్కు స్థాపనకోసం కేటాయించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో రాజధాని ప్రాంతంలో కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు 3838 ఎకరాల భూమిని సిఆర్‌డిఏకు ఉచితంగా అప్పగించేందుకు ఆమోదం తెలిపారు. విశాఖ జిల్లా వంగలిలో పెట్రోలియం వర్శిటీకి శాశ్వత ప్రాంగణ నిర్మాణానికి 201 ఎకరాలు కేటాయించారు. అనంతపురం జిల్లా కోటపల్లిలో టూరిజం ప్రాజెక్టు నిర్మాణానికి 160 ఎకరాల భూమి కేటాయించారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి, వేమవరం గ్రామాల్లో జక్కంపూడి ఎకనమిక్ టౌన్‌షిప్ నిర్మాణానికి 234 ఎకరాలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర అవసరాల కోసం మార్పిడి) చట్టాన్ని బిల్లు రూపంలో మార్పుచేసి రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు.