ఆంధ్రప్రదేశ్‌

మీకు నేనున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: ‘నా పిల్లలైతే ఏవిధంగా న్యాయం చేస్తానో అలానే మీకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలా చూస్తా’.. అంటూ ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి కళాశాల విద్యార్థులు వెలగపూడి సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఒక్క శాతం అవకాశమున్నా విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 9 మందితో కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. సమగ్ర పరిశీలన జరిపి కేంద్రంతో మరోసారి చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను గురువారం ఢిల్లీకి పంపుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, కేంద్రంతో, ఎంసిఐతో మాట్లాడి సుప్రీంకోర్టుకు ఏవిధంగా వెళ్లాలో చూస్తామని విద్యార్థులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.