ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి ఆలయంలో ఘనంగా కైశిక ద్వాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 1: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించింది. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య శ్రీ ఉగ్రశ్రీనివాస మూర్తి ఉభయనాంచారులతో కలిసి మాడ వీధులలో ఊరేగించారు. ఆ తరువాత అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఇఓ, జియ్యంగార్లు పాల్గొన్నారు. శ్రీమహావిష్ణువు భక్తుల్లో ఒకరు కైశికి రాగంతో స్వామిని మేల్కొలిపి ఆ పుణ్యఫలాన్ని బ్రహ్మరాక్షసికి ఇచ్చి, రాక్షసికి మోక్షం కలిగించే కైశిక వృత్తాంతాన్ని అర్చకస్వాములు వివరించారు. ఈ సందర్భంగా టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తిని మాడవీధుల్లో ఊరేగిస్తారని తెలిపారు.

కన్నడ భాషలో టిటిడి వెబ్ సైట్

తిరుపతి, నవంబర్ 1: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే కన్నడిగ భక్తుల కోసం టిటిడి కల్పిస్తున్న వసతి, శ్రీవారి సేవల బుకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కన్నడ వెర్షన్‌లో వెబ్‌సైట్‌ను బుధవారం ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రారంభించారు. టిటిడి సేవ ఆన్‌లైన్.కామ్ అన్న పేరుతో ఈవెబ్‌సైట్‌ను టిటిడి ప్రారంభించింది. టిటిడిలోని పరిపాలనాభవనంలో జరిగిన వెబ్‌సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇఓ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 23న టిటిడి తెలుగు వెర్షన్‌లో వెబ్‌సైట్‌ను ప్రారంభించామన్నారు. త్వరలోనే తమిళ భాషలో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్, రూ.300 ప్రత్యేక దర్శనం, గదులు, కల్యాణ వేదికలను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.