ఆంధ్రప్రదేశ్‌

పంట రుణాలకు పాన్ కార్డు లింకా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: ఇక మీదట రైతులుకు బ్యాంకు రుణాలు ఇవ్వాలంటే పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధనలు విధించడం దారుణమని వైఎస్‌ఆర్‌సిపి రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు. రైతాంగాన్ని బ్యాంకులకు దూరం చేయడంతో పాటు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటమేనని ఆయన మండిపడ్డారు. సన్న, చిన్నకారు రైతాంగానికి పాన్‌కార్డు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. పాన్‌కార్డుకు రుణానికి ఏమిటి సంబంధం అని అన్నారు. ఇలాంటి ఆంక్షలతో రైతాంగాన్ని మరింత కుంగదీస్తే వ్యవసాయ రంగం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎపి ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు విధించడం ద్వారా సిఎం చంద్రబాబు మరోసారి రైతు వ్యతిరేకి అని నిరూపించుకున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రుణ మాఫీ పేరుతో రైతాంగాన్ని నిట్టనిలువునా మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ విధానం వల్ల రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారని అన్నారు. రైతులు వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లపైనా జిఎస్‌టిని విధించడం దారుణమని అన్నారు. ఒక వైపు మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి రూ.5 నుంచి 7 వేలు వసూలు చేస్తుంటే, కొత్తగా జిఎస్టీ పేరుతో 12 శాతం అదనంగా పన్ను విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..
ప్రజా సంకల్పయాత్రతో బెదిరిపోతున్న ప్రభుత్వం
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ చేపట్టనున్న ప్రజా సంకల్పయాత్రతో ప్రభుత్వం బెదిరిపోతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి టిజెఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. బుధవారం నాడిక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత మూడేళ్లగా రాష్ట్రంలో సహజ సంపదను యథేచ్చగా దోచుకుంటున్నారని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రను తట్టుకునే పరిస్థితి లేక ప్రతిపక్ష నేతపై మంత్రులు ఉన్మాదుల్లా మాట్లాడుతున్నారని అన్నారు. నోను అదుపులో పెట్టుకోకపోతే అదే స్థాయిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.