ఆంధ్రప్రదేశ్‌

ఇళ్లపై జెండాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 2: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఎన్ని కుటుంబాలకు చేరుతున్నాయన్న దానిపై లెక్క తేల్చుకునే పనికి టిడిపి శ్రీకారం చుట్టింది. అలాగే టిడిపికి పడే ఓట్లు ఎన్ని? విపక్షానికి ఎన్ని వెళ్తాయో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఓ కార్యక్రమాన్ని చేపడుతోంది. తమకు అనుకూలంగా ఉంటాయని గుర్తించి అలాంటి ఇళ్లపై పార్టీ జెండాలు ఎగరేయాలని టిడిపి నిర్ణయించింది. తటస్థులను గుర్తించడం, సానుభూతి పరులెవరో తెలుసుకోవడం వీలవుందని భావిస్తున్నారు. ముందు ఈ ప్రయోగాన్ని తూర్పు గోదావరి జిల్లా నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గమైన పెద్దాపురం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు జనవరి 18న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని సమాచారం. ఈ వినూత్న కార్యక్రమానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో పయనించడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది.