ఆంధ్రప్రదేశ్‌

పెరుగుతున్న కిడ్నీ బాధిత పెన్షన్‌దారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: కిడ్నీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో సాయం కోసం మరింత మంది ముందుకొస్తున్నారు. దీంతో అదనంగా చేరినవారితో సెర్ప్ అందిస్తున్న కిడ్నీ బాధితుల పింఛన్లు అక్టోబర్‌లో మరో 215 పెరిగాయి. వీరికి ఇతర పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈ సహాయం కొనసాగుతోంది. ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చింది. దాంతో నిరుపేద కిడ్నీ బాధితులకు ప్రతినెలా రూ. 2,500 ఆర్థిక సహాయం అందించడానికి మార్గం సుగమమైంది. ఇందుకు సెర్ప్ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసిందే. సంబంధిత శాఖలతో సంప్రదించిన తర్వాత ఆగస్టు నెల ఆర్థిక సహాయం సెప్టెంబర్ 1న చెల్లించేలా ‘సెర్ప్’ చర్యలు తీసుకుంది. అయితే ఆగస్టులో 1560 మందితో మొదలైన ఈ పెన్షన్లు అక్టోబర్‌లో 2235కు పెరిగాయి. కిడ్నీ వ్యాధి స్టేజ్ 3 నుంచి 5కు మధ్య ఉన్నవారిని పెన్షన్లకు ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సహాయం అందనివారు ఉంటే జిల్లాల్లోని సంబంధిత ప్రభుత్వాసుపత్రుల నుంచి అధికారిక సమ్మతి అందిన వెంటనే వారికీ చెల్లిస్తామని, దీనికి పరిమితులు లేవని సెర్ప్ సిఇవో డాక్టర్ పి కృష్ణమోహన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.