ఆంధ్రప్రదేశ్‌

రూ. 6.50 కోట్లతో 34 వేబ్రిడ్జిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: రాష్ట్రంలోని 34 మండల స్థాయి స్టాక్ పాయింట్ల (ఎంఎల్‌ఎస్) వద్ద రూ.6.50 కోట్ల వ్యయంతో 50 టన్నుల సామర్థ్యం కలిగిన వేబ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ ఎం లింగారెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా పేదలకు కచ్చితమైన తూకాలతో సరకుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ-పోస్ విధానాన్ని అనుసరిస్తోందన్నారు. పేదల మాదిరిగానే రేషన్ డీలర్లకూ కచ్చితమైన తూకాలతో సరకులు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అప్పుడే పేదలకు సరకుల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు 269 చోట్ల గోదాములు ఉన్నాయని తెలిపారు. వాటిలో సొంత గోదాములు 169, అద్దెవి 99 ఉన్నాయన్నారు. సొంత గోదాములున్న 169 చోట్ల వేబ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో మొదటి విడతగా 34 వేబ్రిడ్జిల నిర్మాణం చేపట్టిందన్నారు. త్వరలో మిగిలిన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నామని, నిర్మాణంలో ఉన్న వేబ్రిడ్జిల సేవలు నెలరోజుల్లో అందుబాటులోకి రానున్నాయని లింగారెడ్డి వివరించారు.