ఆంధ్రప్రదేశ్‌

రాజమహేంద్రవరంలో చిరుత కోసం గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 2: రాజమహేంద్రవరంలోని ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్సులో కనిపించిన చిరుత కోసం అటవీ శాఖ గాలింపు కొనసాగుతోంది. 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్సు వెనుకభాగంలోని దట్టమైన రిజర్వు ఫారెస్టులోంచి ఈ చిరుత బేస్ కాంప్లెక్సులోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు. చిరుత భయంతో ఇదే ప్రాంగణంలోవున్న కేంద్రీయ విద్యాలయానికి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణా విభాగం డిఎఫ్‌ఓలు నందిని, ప్రభాకరరావు ఆధ్వర్యంలో గాలిం పు చర్యలు చేపట్టారు. రెండు బోన్లను ఏర్పాటుచేసి అటవీ శాఖ సిబ్బంది చిరుత కోసం మాటువేశారు. అడుగుల ఆనవాళ్ల ఆధారంగా చిరుత జాడ కనిపెట్టడానికి ముందుకు వెళుతున్నారు. ఏడేళ్ల క్రితం ఒకసారి ఇదే ప్రాంతంలో చిరుత ప్రత్యక్షమవ్వడంతో అప్పట్లో బోను ద్వారా అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. ఇపుడు కనిపించిన చిరుత చిన్నసైజుదని ఆనవాళ్లను బట్టి అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అది ఒక కుక్కను తినేసినట్టు కనుగొన్నారు.

చిత్రం..చిరుతను పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్న బోను