ఆంధ్రప్రదేశ్‌

వ్యాపార కేంద్రాలుగా మారుతున్న ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, నవంబర్ 2: రాష్ట్రంలో దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని, ఇది మంచి పరిణామం కాదని విశాఖపట్టణం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే దర్శనం టిక్కెట్లు, ప్రసాదాలు, అభిషేకాల టిక్కెట్లను ఇష్టమొచ్చినట్లుగా పెంచుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆలయాలకు ప్రజలు ప్రశాంతత కోసం వస్తారని, వారు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు సమకూర్చడం మానేసి ధరలు పెంచడానికే అధికారులు,ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదన్నాని సూచించారు. ఆధ్యాత్మిక కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారితే ప్రజలు రారని, అందువలన ధరలు పెంచడం మానుకోవాలని హితవుపలికారు. ఈసందర్భంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఎఇఓలు కృష్ణారెడ్డి, మోహన్, పిఆర్వో హరి తదితరులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వదించారు. తీర్థప్రసాదాలను అంజేశారు.