ఆంధ్రప్రదేశ్‌

తెగబడిన ఎర్రచందనం దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/చిన్నగొట్టికల్లు/మర్రిపాడు/సీతారాంపురం, నవంబర్ 2:, : చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గురువారం ఎర్రచందనం తరలిస్తున్న కూలీల పోలీసులపై తెగబడ్డారు. కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై లారీతో ఢీకొనే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అలాగే తిరుపతి సమీపంలోని కరకంబాడివద్ద మరో ఘటనలో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ వెనుకవైపు ఉన్న అటవీప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ చేస్తుండగా 30మంది కూలీలు టవేరా వాహనంలో ఎర్రచందం లోడింగ్ చేస్తూ కన్పించారు. వెంటనే వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వాహనాన్ని వదిలి కూలీలు అడవిలోకి పారిపోయారు. 25 ఎర్రచందనం దుంగల ను, టవేరా వాహాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనంచేసుకున్నారు. గత నెలరోజుల వ్యవధిలో ఇక్కడ కూలీలు పట్టుబడడం ఇది ఏడవసారి. కాగా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట నాగపట్ల తూర్పు బీటు పరిధిలోని ఎర్రమొరాలు వద్ద స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని డిఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు నేతృత్వంలో అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు తమిళనాడుకు చెందిన కూలీలను అరెస్టుచేసి వారి నుంచి 150 కేజీల బరువు కలిగిన 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదిలావుండగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి అటవీబీట్ పరిధిలోని పడమటి నాయుడు పల్లి వద్ద అక్రమంగా ఎర్రచందనం తరలిస్తుండుగా అధికారులు పట్టుకొన్నారు. గురువారం వేకువజామున కూం బింగ్ జరుపుతున్న అటవీశాఖ అధికారులను చూసి ఎర్రకూలీలు వాహనాన్ని అక్కడే వదిలేసి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.
ఈ సందర్భంగా రూ.10 లక్ష లు విలువ చేసే ఒకటిన్నర టన్ను బరువు కలిగిన 36 ఎర్రచందన దుం గలను స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడిన ఎర్రచందన దుంగలను ఆత్మకూరు అటవీరేంజర్ కార్యాలయం వద్దకు తరలించారు. కాగా ఎర్రచందనం దొంగలు అటవీశాఖ సిబ్బందిని లారీతో ఢీకొట్టడానికి విఫలయత్నం చేశారు.
ఈఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అలాగే ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రామాపురం అటవీ ప్రాంతంలో 28 ఎర్రచందనం దుంగలను సీతారామపురం ఎస్‌ఐ శివరాకేష్ యాదవ్ గురువారం స్వాధీనం చేసుకున్నారు.

చిత్రం..టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు