ఆంధ్రప్రదేశ్
దక్షిణ కోస్తాకు వర్ష సూచన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 November 2017
విశాఖపట్నం, నవంబర్ 2: శ్రీలంకను ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా అల్పపీడనం కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, ఒకటి, రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే గల్ఫ్ ఆఫ్ సియామ్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. ఇది నెమ్మదిగా కదులుతూ రానున్న 48 గంటల్లో అండమాన్ చేరుకోవ్చని పేర్కొన్నారు. అనంతరం అల్పపీడనం బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.