ఆంధ్రప్రదేశ్‌

శాస్తవ్రేత్తల పరిశోధన ప్రగతిపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, నవంబర్ 2: సాగు ఖర్చులు తగ్గించడం, తెగుళ్లను నివారించడం, అధిక దిగుబడులు సాధించడం తదితర ప్రామాణికాలపై శాస్తవ్రేత్తలు అనునిత్యం సాధించే ఫలితాలను ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సంబంధిత పరిశోధనా కేంద్రం ఎడిఆర్ పరిశోధనా సంచాలకులకు ఇట్టే తెలుసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో చెరకు పరిశోధనలో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో చెరకుపై సంబంధిత శాస్తవ్రేత్తలు ఎప్పటికప్పుడు సాగిస్తున్న పరిశోధనలు, సంబంధిత పరిశోధనా ప్రగతిపై ప్రతీనెలా తెలుసుకుంటారని ఇక్కడి పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ జె. కృష్ణప్రసాద్ తెలిపారు. పరిశోధనా కేంద్రం సాధించిన పరిశోధనా ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను తన చాంబర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పరిశోధనా కేంద్రం కృష్ణప్రసాద్ వివరించారు. శాస్తవ్రేత్తలు సాధించిన పరిశోధనలపై ప్రతీ శాస్తవ్రేత్తకు ఒక డ్యాష్‌బోర్డు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ అధునాతన విధానాల్లో మోనటరింగ్ పెరిగి రానున్న కాలంలో పరిశోధనా పరంగా మంచి ఫలితాలు సాధించేందుకు మార్గం సుగమం కానుందన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆయన పత్రికలకు అందజేసారు. 104 ఏళ్ల చరిత్ర కలిగిన అనకాపల్లి పరిశోధనా కేంద్రంలో తొలుత కేవలం చెరకుమీదే పరిశోధనలు జరిగేవి. కాలక్రమేణా దీని ప్రాముఖ్యత పెరిగి ఉత్తర కోస్తా జిల్లాలకే ప్రధాన పరిశోధనా కేంద్రంగా రూపాంతరం చెందింది. చెరకుతోపాటు వరి, నువ్వులు తదితర ఇతరత్రా పంటలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. విత్తనోత్పత్తి కూడా అందుకు అనుగుణంగా అభివృద్ధి చెందుతుంది.
చెరకులో టిష్యూకల్చర్ సాగుపై పరిశోధనలు జరుగుతున్నాయి. టిష్యూ కల్చర్ విధానంలో చెరకు సాగు చేయడం వలన తెగుళ్లు విత్తనం ద్వారా వ్యాప్తి చెందే పరిస్థితి తగ్గుతుంది. ఇక్కడి పరిశోధనా కేంద్రం శాస్తవ్రేత్తలు 206ఎ, 223, 209ఎ, 107 ఈ రెండు అధునాతన వంగడాలపై సాగించిన పరిశోధనల ఫలితాలు ఒక కొలిక్కి వచ్చాయి. హెక్టారుకు 130టన్నుల దిగుబడిని సాధించడంతోపాటు 14.27 టన్నుల పంచదార దిగుబడి సాధించవచ్చు. రసంలో 20 శాతం సుక్రోజ్ ఉంటుంది. ఎర్రకుళ్లు తెగులు, కాటుక తెగులు తదితర తెగుళ్ల నుండి ఈ రకాల వలన విముక్తి పొందవచ్చు. శాస్తవ్రేత్తలు పరిశోధనలను వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తున్నామన్నారు. పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తీవ్రమవుతున్న చీడపీడలను శాస్తవ్రేత్తల దృష్టికి ఎప్పటికప్పుడే తీసుకువచ్చేందుకు ఎప్పటికప్పుడే విధిగా సదస్సులు నిర్వహిస్తున్నారు. చెరకు జరిగే భూముల్లో రక్షణ వలయాలుగా జనుము, జొన్న, మొక్కజొన్న సాగు చేస్తే కొంతవరకు బయటపడవచ్చు. పంట మార్పిడి విధానంతోపాటు ఒంటికన్ను ముచ్చులను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన విత్తనోత్పత్తి ఇక్కడి పరిశోధనా కేంద్రంలో జరుగుతుంది. కూలీల కొరత, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, తెగుళ్ల వలన పంటను రక్షించుకునే పరిస్థితి లేకపోవడం వలన విశాఖజిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం 55 వేల హెక్టార్లనుండి 38వేల హెక్టార్లకు తగ్గిపోయింది.

చిత్రం..ఉత్తర కోస్తా జిల్లాల పరిధికి విస్తరించి ఉన్న అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం