ఆంధ్రప్రదేశ్‌

స్వచ్ఛ మిషన్ నత్తనడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 2: స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అనంతపురం జిల్లాలో నత్తనడకను తలపిస్తోంది. వచ్చే జనవరి 26 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా అనంతపురంను నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయికి పరుగులు పెడుతోంది. కానీ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, కేవలం సమీక్షల ద్వారానే లక్ష్యం సాధించాలని అధికారులను ఆదేశించడంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 26 నాటికి లక్ష్యం సాధించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గడచిన నాలు గు రోజుల్లో జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సమీక్ష సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో లబ్ధిదారులు జాబితాలను తయారు చేస్తున్నారు. ఎంపిడిఒలు క్రియాశీల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ద్వారా స్వచ్ఛ్భారత్ నిధులు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో 2.60 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలన్నది లక్ష్యం. కాగా ఇప్పటి వరకు సుమారు 75 వేల వరకు మాత్రమే పూర్తయ్యాయి. ఆర్‌డబ్ల్యుఎస్ పర్యవేక్షణలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో వేగవంతంగా సాగలేదు. ముఖ్యంగా నిర్మాణాలు పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించకపోవడం, వివిధ దశల్లో ఉన్న వాటికి అవసరమైన సామగ్రి సరఫరా చేయకపోవడం, మండల స్థాయిలో అధికారుల నిర్లక్ష్యవైఖరి వెరసి లక్ష్య సాధనలో వెనుకబాటుకు కారణమయ్యాయి. దీనికి తోడు అర్హులైన లబ్ధిదారులున్నా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు, అధికార తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు, జన్మభూమి కమిటీలు చూపుతున్న వివక్ష తదితర కారణాలతో మరుగుదొడ్ల నిర్మాణం ముందుకుసాగడం లేదు. ప్రతి రోజూ 3 వేలు చొప్పున, మండలానికి కనీసం 50 మరుగుదొడ్లు నిర్మిస్తే తప్ప జనవరి నాటికి లక్ష్య సాధన సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అధికారులైతే హడావుడి చేస్తున్నారే గానీ, తమకు అవసరమైన సిమెంట్ ఇటుకలు, ఇతరత్రా సామగ్రి ప్రభుత్వం అందించే నిధులతో తెచ్చుకునే పరిస్థితి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
రవాణా చార్జీలు అదనంగా రావడం, కూలీలు, బేల్దారులు దొరక్కపోవడంతో పాటు బిల్లులు సకాలంలో ఇవ్వకపోతే చేతి చమురు వదులుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించి, బకాయి బిల్లులతో పాటు ఇప్పుడు నిర్మిస్తున్న వాటికి సకాలంలో బిల్లులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ కృషి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చిత్రం..నల్లమాడ మండలం కుటాలపల్లిలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి