ఆంధ్రప్రదేశ్‌

త్వరలో ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రికల్ వాహన విధానాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ బెంగళూరులో వివిధ సంస్థల ప్రతినిధులతో గురువారం ఆయన సమవేశమై చర్చించారు. ఓలా క్యాబ్స్ ఫౌండింగ్ పార్టనర్ ప్రణయ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు రాష్ట్రానికి సహకరించాలని ఆయనను మంత్రి కోరారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన వెంటనే విశాఖలో 500 ఎలక్ట్రికల్ కార్లు, 100 ఆటోలతో పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని ఓలా సంస్థ ప్రతినిధులు మంత్రిని కోరారు. అంతకుముందు పేనాసోనిక్ ఇండియా హెడ్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రతినిధి అతుల్ ఆర్యాతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమరావతి, విశాఖ, తిరుపతిలో ఎలక్ట్రికల్ వాహనాలను భారీ సంఖ్యలో వినియోగించనున్నట్లు చెప్పారు. రెండు, మూడుచక్రాల ఎలక్ట్రికల్ వాహనాల తయారీ, వినియోగం కూడా పెరగనుందన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి వివిధ విడిభాగాలను తయారుచేసే కంపెనీలను ఆకర్షించేందుకు వీలుగా ఈవీ పాలసీని కూడా తీసుకురాబోతున్నామన్నారు. వాహనాల స్మార్ట్ చార్జింగ్ వ్యవస్థ, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సహకరించాలని మంత్రి కోరారు. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పేనాసోనిక్ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారు. జపాన్‌లోని తమ సంస్థ యాజమాన్యంతో చర్చించేందుకు రావాలని కోరారు. టెక్ మహీంద్ర అధ్యక్షుడు రవిచంద్రన్‌తో కూడా లోకేష్ సమావేశమయ్యారు. 2019 నాటికి లక్ష ఐటి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించాలని, విశాఖలోని యూనిట్‌లో మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఐటిలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సహకరించాలని టెక్ మహీంద్ర ప్రతినిధులను కోరారు. వ. ఐవోటీ స్కూల్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నామని టెక్ మహీంద్ర ప్రతినిధులు తెలిపారు. జూనిపర్ నెట్‌వర్క్స్ ఇండియా ఎండి దినేష్ వర్మ, ముద్రా చైర్మన్ వి శ్రీనివాస్‌తో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. నేషనల్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గోపాలకృష్ణ మంత్రి లోకేష్‌ను కలిసి విశాఖ, తిరుపతిలో స్కూళ్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు.